నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, దర్పల్లి సిరికొండ మండలాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. భారీగా కురిసిన వర్షానికి పంటలు నేలకొరిగాయి.
అకాల వర్షం... రైతన్నలకు తీవ్ర నష్టం - Premature rains farmers loose in Nizamabad
నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి. చివరి దశలో వరుణుడు ముంచెత్తటంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు మునిగిపోయారు. ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అకాల వర్షం... రైతున్నలకు తీవ్ర నష్టం
కోత పూర్తి చేసుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. మూడేళ్ల తర్వాత సమృద్ధి వర్షాలతో ఆనందపడ్డ అన్నదాత ఆశలు అడియాసలయ్యాయి. పంట కోతల సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు.