సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా... రేపు రహదారి నిర్బంధానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్ట్
రహదారుల నిర్బంధానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆర్టీసీ కార్మికులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ధర్నాచౌక్ వద్ద దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మికులను, అఖిల పక్ష నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్ట్
ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ముందస్తు అరెస్టులు చేస్తున్నారంటూ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేనంత నిర్బంధం స్వరాష్ట్రంలో కొనసాగుతుందని వామపక్ష పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సడక్ బంద్పై విపక్ష నేతల భేటీ