నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. యువత కుటుంబం గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సారిక, జడ్పీటీసీ సభ్యులు బాజిరెడ్డి జగన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రవీణ్ కుమార్ - అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
నిజామాబాద్ జిల్లాలోని గోవింద్పల్లిలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రవీణ్ కుమార్