తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఆర్​ఎస్ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్‌ అయింది: ప్రశాంత్​రెడ్డి

Prashant Reddy Counter Bandi Sanjay: బండి సంజయ్​పై మంత్రి ప్రశాంత్​రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సభ ఫెయిల్‌ కాలేదని.. ఈ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్‌ అయిందని వ్యంగాస్త్రాలు సంధించారు. ఇరుకుగల్లీలో జరిగే మీ ప్రజా సంగ్రామసభకు ఎంతమంది వస్తున్నారని ప్రశ్నించారు.

Prashant Reddy
Prashant Reddy

By

Published : Jan 19, 2023, 3:56 PM IST

బీఆర్​ఎస్ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్‌ అయింది: ప్రశాంత్​రెడ్డి

Prashant Reddy Counter Bandi Sanjay: ఖమ్మం బీఆర్​ఎస్ బహిరంగ ​సభపై.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు.. మంత్రి ప్రశాంత్​రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ సభ ఫెయిల్యూర్ కాలేదని.. ఆ సభ చూసి బండి సంజయ్​కు బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. బండి వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇప్పటివరకు ఇంత పెద్ద సభ చూడలేదు అన్నారని గుర్తు చేశారు. నిజామాబాద్​లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తన కంటికి ఎంత దూరం కనిపిస్తుందో.. అంతదూరం కంటే ఎక్కువే జనాలున్నారని అఖిలేష్ చెప్పారని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. ఈ విషయం బండి సంజయ్​కు కనిపించక పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇరుకుగల్లీలో జరిగే మీ ప్రజా సంగ్రామ యాత్ర సభకు ఎంతమంది వస్తున్నారని నిలదీశారు. ముందు 8 ఏళ్లలో దేశానికి మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్ గురించి బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమని ప్రశాంత్​రెడ్డి అన్నారు.

"బీఆర్ఎస్ సభ ఫెయిల్‌ కాలేదు. ఇంతపెద్ద సభ చూడలేదని అఖిలేశ్‌ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్‌ అయింది. సాగుకు ఉచిత కరెంట్‌పై సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం." - ప్రశాంత్‌రెడ్డి, మంత్రి

అసలేం జరిగిదంటే:ఖమ్మంలో జరిగిన బీఆర్​ఎస్​ బహిరంగ సభపై బండి సంజయ్​ విమర్శలు గుప్పించారు. నిన్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప.. బీఆర్ఎస్ సభను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్ఫూర్తిగా పాల్గొనలేదన్నారు. ప్రజలను బెదిరించి సభను విజయవంతం చేయాలని చూశారని విమర్శించారు.కేసీఆర్​ భాష, వేషం తుపాకి రాముడిలా ఉన్నాయని వ్యంగాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఒక జోకర్​ అని, జోకర్ మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దళితులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని.. తెలంగాణను మరచిపోయిన కేసీఆర్​తో జై తెలంగాణ అనిపిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

టీఆర్ఎస్.. బీఆర్ఎస్​గా ఆవిర్భవించిన అనంతరం ఖమ్మంలో తొలిసారి నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ శంఖారావం పూరించారు. జాతీయ నాయకుల సమక్షంలో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు మంచి స్పందన లభించింది. సభకు సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఆప్‌ పార్టీలకు చెందిన అగ్రస్థాయి నాయకులను రప్పించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ముందడుగు వేశారు.

ఇవీ చదవండి:జనం మనసంతా క్రికెట్​పైనే నిన్న కేసీఆర్​ను పట్టించుకున్న నాథుడే లేడు

ఆరంభం అదిరింది.. ఖమ్మం బీఆర్​ఎస్ సభ సూపర్​ హిట్ అయింది

అంబానీ ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్​గా మెహెందీ వేడుక.. సాయంత్రం ఎంగేజ్​మెంట్

ABOUT THE AUTHOR

...view details