తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత్ సరఫరా​ నిలిపివేత - telangana varthalu

పెండింగ్​లో ఉన్న విద్యుత్​ బిల్లు చెల్లించలేదని ప్రభుత్వ కార్యాలయానికే విద్యుత్​ సరఫరాను నిలిపివేసిన సంఘటన నిజామాబాద్​ నగరంలో జరిగింది. ఒక నెల విద్యుత్​ బిల్లు మాత్రమే పెండింగ్​లో ఉందని... ఇలా కరెంట్​ కట్​ చేయటం సరైంది కాదని ఎంపీడీవో సంజీవ్​కుమార్​ అన్నారు.

Power outage to government office in nizamabad
ప్రభుత్వ కార్యాలయానికి విద్యుత్ సరఫరా​ నిలిపివేత

By

Published : Jan 5, 2021, 3:31 PM IST

నిజామాబాద్ నగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించలేదని అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అధికారులు చీకట్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒక నెల మాత్రమే బిల్లు పెండింగ్​లో ఉందని, ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నా ఇంకా రాలేదని ఎంపీడీవో సంజీవ్​కుమార్​ అన్నారు.

కేవలం ఒక నెల విద్యుత్ బకాయి మాత్రమే పెండింగ్​లో ఉందని, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్​ కట్ చేయడం సరైంది కాదని సంజీవ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి విద్యుత్ శాఖ అధికారులపై ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: ఎస్సారెస్పీ నీటితో హన్మకొండలోని కాలనీలు జలమయం!

ABOUT THE AUTHOR

...view details