నిజామాబాద్‌లో తప్పని త్రిముఖ పోరు - అన్ని పార్టీల నుంచి పెరుగుతున్న పోటీచేసే ఆశావహుల సంఖ్య Political Parties Targeting Nizamabad Parliament :రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం ప్రత్యేకంగా నిలవనుంది. గత ఎన్నికల్లో సిట్టింగ్‌గా ఉన్న బీఆర్ఎస్ ఎంపీని ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. పసుపు రైతులు 186 మంది బరిలో నిలిచి లక్ష ఓట్లు సాధించడం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో పని చేస్తుండగా, ఎలాగైనా గెలిచి తీరాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టుదలతో శ్రమిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు కీలకం కానుంది. మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చారు. పార్లమెంట్ పరిధిలో మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగా, రెండేసి చొప్పున కాంగ్రెస్, బీజేపీ గెలిచాయి.
తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు: కేంద్రం
Dharmapuri Arvind InNizamabad Parliament :నిజామాబాద్ లోక్‌సభ ఎంపీగా బీజేపీ నేత ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ఉన్నారు. మరోసారి ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డుప్రకటించడం తమకు కలిసి వస్తుందని బీజేపీ నమ్ముతోంది. గత ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే పసుపు బోర్డు (Turmeric Board) తెస్తానని, లేదంటే పదవికి రాజీనామా చేస్తానని ధర్మపురి అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బోర్డు రావడంతో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకుంటామని ఆ పార్టీ భావిస్తోంది. పార్లమెంట్ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో పసుపు సాగు చేస్తుండటంతో రైతులు మద్దతుగా ఉంటారని భావిస్తున్నారు.
లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలను నియమించిన బీజేపీ - 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు
Parliament Elections 2024 :ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ స్థానంలో గెలిచిన బీజేపీ మిగతా చోట్ల గెలిచిన అభ్యర్థులకు దీటుగా ఓట్లు సాధించింది. ఈసారి ఎలాగైనా నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అలాగే బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు దీటుగా ఓట్లు సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఈసారి గెలిచి బదులు తీర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో నిలిచిన కవిత ఈ సారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Lok Sabha Elections Nizamabad Parliament :ఆ ఎన్నికల్లో అర్వింద్ చేతిలో ఘోర పరాభవం ఎదురు కాగా ఈసారి ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. పదేళ్లుగా పార్లమెంట్‌కు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ సారి మళ్లీ పాగా వేయాలని సంకల్పించింది. ఇప్పటికే ఎంపీ స్థానాలకు ఇంఛార్జిలను నియమించి సన్నద్ధత వైపు అడుగు వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు భారీగానే వచ్చాయి. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మధుయాష్కీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడారు.
చక్కెర పరిశ్రమలు ప్రధాన ఎజెండాగా మారే అవకాశం : మధుయాష్కీ నిజామాబాద్ పార్లమెంట్‌పై విముఖత చూపిస్తున్నందున ఈసారి కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని అన్వేషిస్తోంది. కాంగ్రెస్ సీటు కోసం ఆ పార్టీలో అనేక మంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, సీట్లను ఇతరులకు త్యాగాలు చేసిన నేతలు, పార్టీలో సీనియర్లు ఇలా చాలా మంది తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ తమకు సీటు వచ్చేలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోధన్, మెట్‌పల్లి చక్కెర పరిశ్రమలు ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది. మూతపడిన ఆ పరిశ్రమల పునరుద్ధరణ అంశం ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధరతో పాటు గల్ఫ్ సమస్యలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
ED, CBI దాడులే ప్రతిపక్షాల టార్గెట్.. ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు
telangana in parliament : స్థానిక సంస్థలకు ఆరేళ్లలో రూ. 8,587 కోట్లు