గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలలో కొంతమందిని గృహ నిర్భంధం చేసి.. మరికొంతమందిని అరెస్టు చేశారు. జిల్లాలోని సారంగపూర్, అలీసాగర్, భూంపల్లి వద్ద కొనసాగుతున్న ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ వివిధ ప్యాకేజీల వద్ద ఆందోళనలు చేపట్టేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు సిద్ధమయ్యారు. ఆ దీక్షలకు హాజరయ్యేందుకు బయలుదేరనున్న మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలను హైదరాబాద్ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతలను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్ట్ చేస్తూ జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ నేతల జలదీక్షను భగ్నం చేసిన పోలీసులు - కాంగ్రెస్ జలదీక్ష
గోదావరి నదిపై చేపట్టిన ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ చేపట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు జలదీక్ష నిర్వహించకుండా అరెస్ట్ చేశారు. జిల్లాలోని ముఖ్య నేతలను గృహ నిర్భంధం చేశారు.
![కాంగ్రెస్ నేతల జలదీక్షను భగ్నం చేసిన పోలీసులు Police Stopped Congress Jala Deeksha In Nizamabad District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7599472-200-7599472-1592041589192.jpg)
కామారెడ్డిలో భుంపల్లి వద్ద దీక్ష చేసేందుకు వెళ్తున్న జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మదన్ మోహన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సుభాష్ రెడ్డి లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనం ఎక్కేందుకు మదన్ మోహన్ నిరాకరించి.. నడుచుకుంటూ వెళ్లారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు నిరసన దీక్షలు చేపడితే అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ