నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం శివాజీ విగ్రహం ఏర్పాటులో సహకారం అందించారని మున్సిపల్ చైర్మన్ తూము పద్మ భర్త శరత్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతరం స్టేషన్ బెయిల్ తీసుకున్న ఇంటికి వెళ్లారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చే సమయంలో శరత్ రెడ్డి అనుచరులు పూలు చల్లి హంగామా చేశారు.
బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన వెంటనే మళ్లీ అరెస్టు.. ఎందుకంటే? - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
బోధన్‌లో శివాజీ విగ్రహం ఘర్షణల్లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త శరత్ రెడ్డి శుక్రవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. అనంతరం ఆయన స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో స్టేషన్ బయట ఆయన అనుచరులు హంగామా చేయడంతో పోలీసులు తిరిగి శరత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
పోలీస్‌స్టేషన్
దీనిపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శరత్ రెడ్డి స్టేషన్ బెయిల్‌తో ఇంటికి వెళ్లి వెళ్లగానే మళ్లీ అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఇద్దరు అనుచరులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి: ఆస్తి పన్ను కట్టలేదని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్
Last Updated : Mar 26, 2022, 1:32 PM IST