నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా యువకులకు క్రీడాపరికరాలు పంపిణీ చేశారు. బాల్కొండ యువకులకు క్రికెట్ కిట్టును, బోదేపల్లి, చిట్టాపూర్, వన్నెల్(బి) గ్రామాల యువకులకు వాలీబాల్ కిట్లు అందజేశారు.
'యువత వ్యసనానికి దూరంగా ఉండాలి' - CRICKET KITS
యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై శ్రీహరి తెలిపారు. బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు.
police distributed games kits to youngers
యువకులు వినాయక ఉత్సవాలు, దుర్గాదేవి నవరాత్రోత్సవాలు జరుపుకోవడంతోపాటు హనుమాన్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆశిస్తూ... క్రీడా పరికరాలు అందజేసినట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి క్రీడా పరికరాలు వచ్చాయని తెలిపారు. యువకులు వ్యసనాలకు దూరంగా ఉండి... మంచి మార్గంలో నడవాలని సూచించారు. తమ భవిష్యత్తును బంగారు మయంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు.