రోడ్డుపై వాహనాలు నడిపేవారు తప్పకుండా నియమాలు పాటించాలని ఏడో బెటాలియన్ అదనపు కమాండర్ సత్య శ్రీనివాసరావు అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని బెటాలియన్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి నడపాలని ప్రతిజ్ఞ చేశారు.
డిచ్పల్లిలో హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ - నిజామాబాద్ జిల్లా వార్తలు
వాహనదారులు తప్పకుండా రోడ్డు నియమాలు పాటించాలని ఏడో బెటాలియన్ అదనపు కమాండర్ సత్య శ్రీనివాసరావు చోదకులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో పోలీసులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ చేశారు.

డిచ్పల్లిలో హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ
డిచ్పల్లిలో హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ
ద్విచక్రవాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సత్య శ్రీనివాసరావు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. బైక్పై ముగ్గురు వెళ్లరాదని.. చరవాణి మాట్లాడుతూ నడపొద్దని హితవు పలికారు.
ఇవీ చూడండి:లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగన్