ఓటు చాలా పవిత్రమైనదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తన సొంత గ్రామం పోచారంలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామాలకి వెళ్లి ఓటు వేయాలని కోరారు. ప్రజల తీర్పు గొప్పదని అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధంగా ఓటు వేసి దేశాన్ని ఎవరూ పరిపాలించాలో ఎన్నుకోవాలని సూచించారు.
ప్రజల తీర్పు చాలా గొప్పది: శ్రీనివాస రెడ్డి - POCHARAM SRINIVASA REDDY
సొంత గ్రామమైన పోచారంలో అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస రెడ్డి.. సతీసమేతంగా ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ సొంతూర్లకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.
పోచారం శ్రీనివాస రెడ్డి