తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2021, 10:38 PM IST

ETV Bharat / state

హోలీ సందర్భంగా ఆ గ్రామంలో వింత ఆచారం

ఆ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే చాలు ఓ వింత ఆచారం కొనసాగుతుంది. గ్రామంలోని పురుషులంతా కలిసి సాయంత్రం సమయంలో పిడికిళ్లతో గుద్దులాట ఆడుతారు. ఈ ఏడాది కరోనా కారణంగా కొద్దిసేపు మాత్రమే జరపుకున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. పిడిగుద్దులాట ఆపితే అరిష్టం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

pidiguddhulata culture, hunsa nizamabad news
హోలీ సందర్భంగా ఆ గ్రామంలో వింత ఆచారం

నిజమాబాద్ జిల్లా హున్సాలో హోలీ పండుగ సందర్భంగా పిడిగుద్దులాట ఆనవాయితీగా వస్తుంది. ఏళ్ల తరబడి వస్తున్న ఆచారాన్ని మానకుండా గ్రామస్థులంతా కొద్దిసేపు ఆడారు. హున్సాలో పిడిగుద్దులాట ఆపితే అరిష్టం జరుగుతుందని భావించి చిన్నగా ఆడామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఏటా పెద్ద జాతరను తలపించే విధంగా ఆడేవారు.. ఈసారి కరోనా కారణంగా కొద్దిసేపు జరపుకున్నట్లు స్థానికులు తెలిపారు.

బోధన్ పోలీసులు నాలుగు రోజుల క్రితం హున్సా గ్రామస్థులతో సమావేశం నిర్వహించి కరోనా సెకండ్ వేవ్ విజృంభింస్తుండడం వల్ల.. పిడిగుద్దులాట నిర్వహించొద్దని సూచించారు. కానీ ఆనవాయితీగా ఆడే పిడి గుద్దులాట ఈ రోజు సాయంత్రం కొనసాగించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. ప్రేమ, అప్యాయలతో పిడి గుద్దులాట ఆడామని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు వచ్చి ఈ ఆటను తిలకించేవారని వెల్లడించారు.

హోలీ సందర్భంగా ఆ గ్రామంలో వింత ఆచారం

ABOUT THE AUTHOR

...view details