తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓబీసీ ఫెలోషిప్​ను 6 వేలకు పెంచాలి...

ఓబీసీ ఫెలోషిప్​లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఓబీసీ ఫెలోషిప్​ను 6 వేలకు పెంచాలని డిమాండ్​ చేశారు.

PHC SCHOLERS PROTESTED AT TELANGANA UNIVERCITY FOR OBC FELLOWSHIPS

By

Published : Sep 9, 2019, 11:17 PM IST

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు పీహెచ్​డీ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇటీవల విడుదల చేసిన ఓబీసీ ఫెలోషిప్​లో తెలుగు రాష్ట్రాల పరిశోధక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని... దీని వల్ల ఓబీసీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఓబీసీ ఫెలోషిప్​ను 6 వేలకు పెంచాలని డిమాండ్​ చేశారు. గత నాలుగేళ్లుగా ఎస్సీ ఫెలోషిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీ, ఎస్సీ విద్యార్థులకు సెట్, నెట్ వంటి షరతులు లేకుండా ఫెలోషిప్​లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఓబీసీ ఫెలోషిప్​ను 6 వేలకు పెంచాలి...

ABOUT THE AUTHOR

...view details