నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 41వ రోజుకు చేరుకుంది. నవీపేట్ మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నాయకులు భిక్షాటన చేసి తమ నిరసనను తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఐకాసాతో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. బోధన్‌లోని ఆర్టీసీ కార్మికులు తమకు వచ్చిన విరాళాలతో 30 మంది కార్మికులకు నెలకు సరిపడా సరుకులు కొని ఇచ్చారు. బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలోని దీక్షా స్థలిలోని కార్మికులకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు నెలకు సరిపడా సరుకులు - latest news of tsrtc workers
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు అఖిలపక్ష నాయకులు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బోధన్‌లోని ఆర్టీసీ కార్మికులకు నెలకు సరిపడా సరుకులను కొనిచ్చారు.
ఆర్టీసీ కార్మికులకు నెలకు సరిపడా సరుకులు