మద్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం వల్ల నెలన్నరగా మూతపడిన మద్యం దుకాణాలు బుధవారం తెరుచుకున్నాయి. ఉదయం నుంచే మద్యపాన ప్రియులు వైన్ షాపుల వద్ద బారులు తీరారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా వైన్స్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నో మాస్క్... నో లిక్కర్ అంటూ ఎక్సైజ్ అధికారులు సూచించడం వల్ల... మాస్కులు ధరించిన వారికే యజమానులు మద్యం అమ్ముతున్నారు.
కామారెడ్డిలో...
కామారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని మద్యం విక్రయ కేంద్రాల వద్ద జనసందడి నెలకొంది. మద్యం దొరక్క విలవిల్లాడిన జనాలు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోతే మద్యం షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలతో యజమానులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం దొరుకుతుందో లేదో అని ఉదయం 8 గంటల నుంచే మందుబాబులు వరుసలో నిల్చున్నారు.
బాన్సువాడలో...
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో మద్యం కొనేందుకు మద్యం ప్రియులు ఎగబడ్డారు. పోలీసుల బందోబస్తు నడుమ మద్యం దుకాణాల నిర్వాహకులు విక్రయాలు జరిపారు. భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. మాస్క్ ధరించి వచ్చిన వారికే మద్యం అమ్మారు. మాస్క్‌లు ధరించకుండా షాపు వద్దకు వచ్చిన వారికి పోలీసులు జరిమానా విధించారు. పలు మద్యం దుకాణాల వద్ద జనాలు ఎగబడడం వల్ల పోలీసులు వారిని చెదరగొట్టారు.
బాల్కొండలో...