రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పీజీ సెంటర్లను ఎత్తి వేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్లో పీడీఎస్యూ నగర కమిటీ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. పీజీ సెంటర్ల ఎత్తివేత ప్రకటన జారీ చేయడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని పీడీఎస్యూ నగర అధ్యక్షుడు సాయి కృష్ణ పేర్కొన్నారు. పీజీ సెంటర్ల ఎత్తివేతను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. విద్యని వ్యాపారంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు.
పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం.. - students
పీజీ సెంటర్ల ఎత్తివేతను నిరసిస్తూ నిజామాబాద్లో పీడీఎస్యూ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం..