నిజామాబాద్ నూతన సమీకృత కలెక్టరేట్‌కు ఆర్టీసీ సిటీ బస్సులు నడిచేలా చొరవ చూపాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. త్వరలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రకటించడం అభినందనీయమని.. నగర శివారులో ఉండటం వల్ల కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నుంచి నూతన సమీకృత కలెక్టరేట్‌కు సిటీ బస్సులు నడపాలని కోరారు.
నూతన కలెక్టరేట్‌కు బస్సులు నడపాలంటూ పీడీఎస్‌యూ ధర్నా - pdsu nirasana
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన సమీకృత కలెక్టరేట్‌కు ఆర్టీసీ బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
![నూతన కలెక్టరేట్‌కు బస్సులు నడపాలంటూ పీడీఎస్‌యూ ధర్నా pdsu-dharna-in-front-of-nizamabad-collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8900775-1050-8900775-1600793426634.jpg)
నూతన కలెక్టరేట్‌కు బస్సులు నడపాలంటూ పీడీఎస్‌యూ ధర్నా
ఈ మేరకు ఫిర్యాదుల పెట్టె ద్వారా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ధర్నాలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల