తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్షల దృష్ట్యా విశ్వవిద్యాలయం వసతి గృహాలను తెరవాలి - pdsu demanded for university hostels should be open

పీజీ చివరి సంవత్సరం పరీక్షల రీత్యా విశ్వవిద్యాలయం వసతి గృహాలను వెంటనే తెరవాలని పీడీఎస్​యు కోరింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎన్ఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు.

university hostels should be opened for examination purposes
పరీక్షల దృష్ట్యా విశ్వవిద్యాలయం వసతి గృహాలను తెరవాలి

By

Published : Nov 2, 2020, 2:57 PM IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 9 నుంచి 13 వరకు పీజీ పరీక్షలు నిర్వహించనున్నారు. యూనివర్సిటీ క్యాంపస్​లో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్ష కేంద్రాలను అన్ని యూనివర్సిటీలలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

యూనివర్సిటీ పరీక్ష కేంద్రాలకు.. గ్రామీణ విద్యార్థులకు సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది, పరీక్షల మధ్య ఒక్క రోజు కూడా వ్యవధి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక భారం, బస్సుల్లో ప్రయాణించడం వల్ల కరోన సోకే అవకాశం ఉన్నందున యూనివర్సిటీ హాస్టల్స్ తెరవాలని పీడీఎస్​యు కోరింది. పరీక్షల మధ్య ఒక రోజు వ్యవధి ఇవ్వాలని, కచ్చితంగా యూనివర్సిటీ కేంద్రాలతో పాటు అన్ని జిల్లాల్లో పీజీ, డిగ్రీ ప్రైవేట్ కళాశాలల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: ఆ చట్టాలను రద్దు చేయాలి: ఏఐకేఎస్​సీసీ

ABOUT THE AUTHOR

...view details