పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ రక్తదానం - nizamabad news
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు పలు సమాజ సేవలు చేస్తున్నారు. నిజామాబాద్ డిచ్పల్లి మండలంలోని పవన్ అభిమానులు... రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
![పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ రక్తదానం pawan kalyan fans donated blood in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8652383-219-8652383-1599045994126.jpg)
pawan kalyan fans donated blood in nizamabad
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని జగ్జీవన్ రావ్ కాలనీకి చెందిన పవన్ కల్యాణ్ అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సూమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. కరోనా నేపథ్యంలో బ్లడ్ బ్యాంకుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త నిల్వలు తగ్గి పోవడం వల్ల తమ వంతు కృషిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అభిమానులు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తదానం చేసి కరోనా కష్ట కాలంలో రక్త నిల్వలు పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.