పట్టణ ప్రగతి ప్రణాళిక మొక్కుబడిగా చేస్తున్న కార్యక్రమం కాదని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్పొరేషన్ 43వ డివిజన్‌లో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు.
'పట్టణ ప్రగతి మొక్కుబడి కార్యక్రమం కాదు' - nizamabad district latest news
తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. నగర పాలక పరిధిలో అమలవుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
!['పట్టణ ప్రగతి మొక్కుబడి కార్యక్రమం కాదు' pattana pragathi program in nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6257774-thumbnail-3x2-nzb-rk.jpg)
పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ గుప్తా
అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతం కావడం వల్ల అత్యధిక జనాభా ఉండే పట్టణాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని పేర్కొన్నారు.
పట్టణ ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ గుప్తా