నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్ వద్ద పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లాలోని 12 యోగా శిక్షణ కేంద్రాల నుంచి సుమారు 200 మంది హాజరయ్యారు. చెరువులు, నదుల నుంచి సేకరించిన మట్టిలో కలబంద, కుప్పంటి, వేపాకు, కానుగాకు, తక్కిలాకు వంటి వివిధ ఆకుల మిశ్రమాన్ని వేసి కలిపి శరీరానికి పూసుకున్నారు.
'మట్టి స్నానంతో చర్మసంబంధ రోగాలు మాయం' - నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లాలోని పతంజలి యోగా కేంద్రం వద్ద మట్టి స్నానం కార్యక్రమం జరిపారు. 200 మంది యోగా అభ్యాసకులు, శిక్షకులు పాల్గొని మట్టిని శరీరానికి పూసుకుని కొద్ది సేపటి తర్వాత స్నానం చేశారు.
'మట్టి స్నానంతో చర్మసంబంద రోగాలు దూరం'
అలా పూసుకున్నాక 50 నిమిషాల తరువాత స్నానం చేస్తే ఎలాంటి చర్మ సంబంధ వ్యాధులు దరిచేరవని యోగా శిక్షకులు, కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.