ETV Bharat / state
పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు
నామపత్రాలు దాఖలు చేసేందుకు సోమవారం చివరి రోజు కావటం వల్ల నిజామాబాద్‌కు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు రైతులు సిద్ధమయ్యారు.
నిజామాబాద్‌లో పార్లమెంట్ స్థానానికి రైతుల నామినేషన్లు
By
Published : Mar 25, 2019, 5:50 AM IST
| Updated : Mar 25, 2019, 7:30 AM IST
నిజామాబాద్‌లో పార్లమెంట్ స్థానానికి రైతుల నామినేషన్లు నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి.. మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలోని రాయికల్, సారంపూర్, బీర్పూర్, మేడిపల్లి, మెట్‌పల్లి, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, గొల్లపల్లి, మల్యాల, మల్లాపూర్ మండలాల పరిధిలోని రైతులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ధ్రువ పత్రాలతో పాటు బలపరిచే వారిని సిద్ధం చేసుకుని నిజామాబాద్ తరలి వెళ్తున్నట్లు రైతులు వివరించారు.. Last Updated : Mar 25, 2019, 7:30 AM IST