నిజామాబాద్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
'పెట్టుబడిదారులకు కేంద్ర ఊడిగం చేస్తుంది' - bandh at nizamabad bodhan
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారత్ బంద్ పాక్షికం కొనసాగుతోంది. వామపక్ష పార్టీల నాయకులు బోధన్ అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ చేపట్టారు.
!['పెట్టుబడిదారులకు కేంద్ర ఊడిగం చేస్తుంది' Nizamabad District The Bharat Bandh continues under the auspices of the Left parties](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11165295-968-11165295-1616742494761.jpg)
ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో రైతులు 120 రోజులగా దీక్షలు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. భాజపా విధానాలను వ్యతిరేకిస్తూ.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులకు కేంద్రంఊడిగం చేస్తూ దేశ సంపద అంతా వారికి అందిస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజలు భాజపా ప్రభుత్వాన్ని మట్టికరిపిస్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఢాకాలో అమరవీరుల స్మారకం వద్ద మోదీ నివాళులు