తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ కలెక్టర్​కు తల్లిదండ్రుల ఫిర్యాదు - parents

మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నిజామాబాద్​ పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. సరైన భవంతి లేక 300 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారన్నారు.

నిజామాబాద్​ కలెక్టర్​కు తల్లిదండ్రుల ఫిర్యాదు

By

Published : Aug 19, 2019, 7:42 PM IST

నిజామాబాద్​ కలెక్టర్​కు తల్లిదండ్రుల ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమనపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజావాణిలో కలెక్టర్​ రామ్మోహన్​ రావుకు ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులు పట్టించుకోవట్లేదని తాము ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు బాలికల తల్లిదండ్రులు పేర్కొన్నారు. సరైన భవంతి లేక వర్షాకాలం ఇబ్బంది కావడం వల్ల 300 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారన్నారు. విద్యార్థులు ఇంటికెళ్లి 20 రోజులు గడుస్తున్నా ఎవరూ స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details