తెలంగాణ

telangana

ETV Bharat / state

'తల్లిదండ్రులూ..పిల్లల్ని వాటి జోలికి పోనివ్వకూడదు'

విద్యార్థులు, యువత అంతర్జాల ఆటలను ఆడుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని మానసిక వైద్య నిపుణుడు, డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదకర ఆటలకు పిల్లల్ని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను కోరారు.

మొబైల్ గేమ్స్​తో యువత తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు

By

Published : Apr 23, 2019, 7:34 PM IST

ఆన్​లైన్ ఆటలతో విద్యార్థులు, యువకులు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందూరు యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో "అర చేతిలో మృత్యు క్రీడలు" అనే కార్యక్రమాన్ని బాల్ భవన్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశాల్ హాజరయ్యారు. అంతర్జాల క్రీడలకు బానిసలై విద్యార్థులు చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మొబైల్ గేమ్స్​తో యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించి అంతర్జాల ఆటల జోలికి వెళ్లకుండా చూడాలని సూచించారు.

తల్లిదండ్రులు ప్రమాదకర ఆటలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి

ABOUT THE AUTHOR

...view details