తెలంగాణ

telangana

సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి : మంత్రి వేముల

By

Published : Feb 19, 2020, 5:38 PM IST

నిజామాబాద్‌లో పల్లె ప్రగతి కార్యక్రమంపై జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. సమష్టి కృషితో పనిచేస్తేనే గ్రామాలు అందంగా మారుతాయని అధికారులు, నాయకులు సూచించారు.

panchayahiraj sammelanam inauguration in Nizamabad district
సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి : మంత్రి వేముల

నిజామాబాద్‌లో పల్లె ప్రగతి కార్యక్రమంపై పంచాయతీ రాజ్ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ, కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరెంట్, కాళేశ్వరంతో నీళ్లు వచ్చాయని వెల్లడించారు. పేదవారికి అండగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. సమష్టి కృషితో పనిచేస్తేనే గ్రామాలు అందంగా మారుతాయని సూచించారు. చెట్లను పెంచటం అందరూ బాధ్యతగా తీసుకోవాలని.. నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని తెలిపారు.

సమష్టి కృషితోనే గ్రామాభివృద్ధి : మంత్రి వేముల

ఇవీ చూడండి:అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details