తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి' - నిజామాబాద్​ జిల్లా తాజా వార్త

ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతోందని..  ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో  నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి గ్రామంలో ఆయన పర్యటించారు.

palle pragathi in nizamabad
'ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి'

By

Published : Jan 13, 2020, 3:09 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా మొదటి విడత పల్లె ప్రగతిలో పచ్చదనం, పరిశుభ్రత పాటించి దానిని విజయవంతం చేశామని అన్నారు.

అదే స్ఫూర్తితో రెండో విడత పల్లె ప్రగతిని 12 రోజులు పాటు దిగ్విజయంగా నిర్వహించి.. నేటితో పూర్తి చేశామన్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి పిలుపునిచ్చారు. నాటిన మొక్కల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి వాటిని పెంచి పెద్దచెయ్యాలని.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

'ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి'

ఇదీ చూడండి: 'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details