తెలంగాణ

telangana

ETV Bharat / state

పొలంలో ఉన్న సుమారు 300 వరిధాన్యం బస్తాలు దగ్ధం - పొలంలో ఉన్న వరిధాన్యం దగ్ధం

పొలంలో ఉన్న ధాన్యం దగ్ధమైన ఘటన నిజామాబాద్ జిల్లా బినోల గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.

Paddy burned
Paddy burned

By

Published : May 20, 2020, 10:42 PM IST

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల గ్రామ శివారులో పొలంలో ఉంచిన వరి ధాన్యం దగ్ధం అయ్యింది. గుర్తుతెలియని వ్యక్తులు పంట పొలాలలోని పిలకలకు నిప్పు పెట్టడం వల్ల అది పక్కనే ఉన్న ధాన్యం బస్తాలకు అంటుకుంది.

బినోల గ్రామానికి చెందిన ఆరుగురు రైతులకు చెందిన సుమారు 300 బస్తాల వరి ధాన్యం దగ్ధం అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details