నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘ ఎన్నికల పోలింగ్... ప్రశాంతంగా ముగిసింది. ఉదయం7 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగగా... 82.83 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాలో 89 సొసైటీలకు గాను... 26 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 63 సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. 1147 డైరెక్టర్లలకు గాను... 736 డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవం కాగా... మిగతా 413 స్థానాల ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా సహకార సంఘాల ఎన్నికలు - NIZAMABAD PACS ELECTIONS
రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా... 89 సొసైటీలకు గాను 63 స్థానాలకు ఎన్నికలు జరిగగా... 82.83 శాతం ఓటింగ్ నమోదైంది.
PACS ELECTIONS COMPLETED IN NIZAMABAD