తెలంగాణ విశ్వవిద్యాలయం(telangana university latest news)లో ఔట్సోర్సింగ్ నియామకాలు(telangana university outsourcing jobs) వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. యూనివర్సిటీ(telangana university latest news) ప్రారంభం నుంచే ఇష్టారీతిన నియామకాలు చేశారు. అసలు ఉద్యోగుల కంటే వీరి సంఖ్యే అధికంగా ఉంది. గతంలో సాంబయ్య వీసీగా ఉన్నప్పుడు సైతం 60 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా నియమించారు. వివాదాస్పదం కావడంతో ఉన్నతవిద్యామండలి ఆ నియామకాల(telangana university outsourcing jobs)ను రద్దు చేసింది. ఇప్పుడు కొత్త వీసీ, రిజిస్టార్ రాకతో మళ్లీ అదే వివాదాల తుట్టెను కదిపారు. ఉద్యోగానికి ఇంతంటూ ఖరీదు కట్టి మరీ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దాదాపు వంద మంది వరకు ఇప్పటికే నియమించినట్లు ఆరోపణలున్నాయి. కొత్త వీసీ, రిజిస్టార్ వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే గడిచాయి. వర్సిటీ అభివృద్ధిని పట్టించుకోకుండా అక్రమ నియామకాలు చేపట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచేలా చేశారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నోటిఫికేషన్లు ఇవ్వకుండానే..
నాలుగు నెలల కింద తెలంగాణ విశ్వవిద్యాలయం నూతన వీసీగా ఆచార్య రవీందర్ గుప్తా వచ్చారు. ఆ తర్వాత రిజిస్టార్‌గా కనకయ్యను వీసీ నియమించారు. గత నెల రోజుల నుంచి ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగులను నియమించుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలపై ప్రభుత్వ నిషేధం ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా, నోటిఫికేషన్ లేకుండా వర్సిటీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టడం వివాదానికి కారణమైంది. ఎంతో ప్రతిష్టత్మకమైన విశ్వవిద్యాలయంలో ఇలాంటి అక్రమాలకు తెరలేపిన వీసీ.. ఆ పోస్టుకు అనర్హుడని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏమాత్రం లెక్కచేయకుండా..
"ప్రజాప్రతినిధులు, వర్సిటీ అధికారులతో పాటు సిఫార్సులతో వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వంటి వారు సిఫార్సు చేసిన అభ్యర్థులను వదిలేసి మిగతా వారి నుంచి పోస్టుకు ఇంత అంటూ వసూలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఖాళీలు చూపకుండా.. రిజర్వేషన్లను పాటించకుండా.. ఈసీ సమావేశం నిర్వహించి అనుమతి తీసుకోకుండా.. ఉద్యోగాలను అమ్మేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీలో పని చేసే ఉద్యోగుల బంధువులు, కుటుంబసభ్యులను సైతం ఇష్టారాజ్యంగా నియమించుకున్నారు. టీయూలో అక్రమంగా చేపట్టిన నియామకాల విషయం వివాదం అవుతున్నా.. ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు ఇచ్చినా.. వీసీ, రిజిస్టార్ లెక్క చేయడం లేదు. నియామకాలు చేస్తూనే.. అలాంటిదేమీ జరగడం లేదంటూ బుకాయిస్తున్నారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులు రిజిస్ట్రర్లలో సంతకాలు చేస్తూ.. జీతాల కోసం ఆధార్, బ్యాంకు వివరాలను సైతం వర్సిటీ అధికారులకు అందించారు."- విద్యార్థి సంఘ నాయకులు
సీఎం కేసీఆర్ సీరియస్..
ఈ నియామకాల వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారడం వల్ల ఉన్నత విద్యామండలితో పాటు విద్యాశాఖ దృష్టి సారించింది. వారికి విద్యార్థి సంఘాల నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ఇటీవల ఉన్నత విద్యాశాఖ నుంచి వర్సిటీకి వచ్చి రికార్డులు తీసుకున్నట్లు సమాచారం. అలాగే జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం ఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వ్యవహారంపై సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అక్రమంగా నియామకాలు జరిగితే.. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రికి సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వర్సిటీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.
ఏమైనా.. ఈ అక్రమ నియామకాల వ్యవహారం వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చుతోంది. వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి: