తెలంగాణ

telangana

ETV Bharat / state

'కార్పొరేట్​కు దీటుగా నాణ్యమైన విద్యే గురుకుల పాఠశాల ఉద్దేశం' - జ్యోతిబాపులే

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కార్పొరేట్​ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడమే గురుకుల పాఠశాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

'కార్పొరేట్​కు దీటుగా నాణ్యమైన విద్యే గురుకల పాఠశాల ఉద్దేశం'

By

Published : Sep 1, 2019, 4:56 PM IST

నిజామాబాద్​ జిల్లా వర్ని మండలంలోని పాత వర్నిలో మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పోటీపడే విధంగా నాణ్యమైన విద్యను అందించడమే గురుకుల పాఠశాల ప్రధాన ఉద్దేశమని పోచారం సభాపతి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 906 గురుకుల పాఠశాలలను మంజూరు చేసిందన్నారు. అన్ని గురుకులాలలో 5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని... ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ఎం రావు, బోధన్ ఆర్డీవో గోపి, వర్ని తహసీల్దార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

'కార్పొరేట్​కు దీటుగా నాణ్యమైన విద్యే గురుకల పాఠశాల ఉద్దేశం'

ABOUT THE AUTHOR

...view details