నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 7,513 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 7,513 క్యూసెక్కులుగా నమోదైంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ
ఉత్తర తెలంగాణ వర ప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ఎగువ నుంచి వచ్చే వరదనీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న స్వల్ప ప్రవాహం
శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1089.8 అడుగులు ఉండగా... పూర్తి నీటిమట్టం 1091 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 83.772 టీఎంసీలు కాగా.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90.313 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చదవండి:రికవరీలే ఎక్కువ.. మరణాలు తక్కువే!