తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి కొనసాగుతోన్న వరద ప్రవాహం - శ్రీరాంసాగర్​ జలాశయం తాజా వార్తలు

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1088 అడుగులుగా ఉంది.

Ongoing flood flow into the Sriramsagar project
శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి కొనసాగుతోన్న వరద ప్రవాహం

By

Published : Aug 23, 2020, 9:51 AM IST

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 18,727 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఔట్​ఫ్లో 1008 క్యూసెక్కులుగా ఉంది.

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1088 అడుగులకు చేరింది. మరో 3 అడుగుల మేర నీరు చేరితే.. ప్రాజెక్ట్ నిండుకుండలా దర్శనమివ్వనుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 90.313 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 76.42 టీఎంసీలుగా ఉంది.

ఇదీచూడండి: మరో అడుగు దూరం.. నిండు కుండలా నాగార్జున సాగర్

ABOUT THE AUTHOR

...view details