నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన సగ్గం శ్రీకాంత్ దత్తాపూర్ గ్రామ పంచాయితీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే విధుల నిమిత్తం వెళ్లిన ఆయన... పని పూర్తవగానే ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు కల్వర్టుకు ఢీకొట్టాడు. తలకి పెద్ద గాయమై అక్కడే పడిపోయాడు.
కల్వర్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి - నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లా నందిపేట్ వద్ద ఓ ద్విచక్ర వాహనం కల్వర్టుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కల్వర్టును ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి
స్థానికులు శ్రీకాంత్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ఆయన మృతి చెందాడు. శ్రీకాంత్‌కి భార్య, ఇద్దరు కుతుళ్లు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!