తెలంగాణ

telangana

ETV Bharat / state

పరువు పోతుందని బిడ్డను అమ్ముకుంది.. - బిడ్డను అమ్మిన అమ్మ

భర్త చనిపోయిన పదిహేనేళ్లకు గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బంధువులకు తెలిస్తే పరువుపోతుందని కన్నబిడ్డనే విక్రయానికి పెట్టిందో మహాతల్లి.

భర్త చనిపోయిన 15ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చింది..

By

Published : May 18, 2019, 1:32 PM IST

Updated : May 18, 2019, 2:08 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో పసికందు విక్రయం కలకలం సృష్టించింది. ఈ నెల 4న సాయి ప్రసన్న ఆస్పత్రిలో నాందేడ్​కి చెందిన పార్వతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త 15ఏళ్ల క్రితమే మరణించాడు. పరువుపోతుందని కన్నబిడ్డను వద్దనుకుంది. అదే విషయం వైద్యురాలు ప్రసన్నకి తెలిపింది. తన బంధువులకు పిల్లలు లేకపోవడం వల్ల ఆ బాబుని వాళ్లకి విక్రయిస్తానని డాక్టర్ చెప్పింది. 4 రోజుల పసికందును ఆయాకి ఇచ్చి హైదరాబాద్ తరలించింది. బాబుని విక్రయిస్తుండగా ఐసీడీఎస్ అధికారి లలితాకుమారి పట్టుకున్నారు. బాబుని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయా శనాష్ బేగం, వైద్యురాలు ప్రసన్న, తల్లి పార్వతిలపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

భర్త చనిపోయిన 15ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చింది..
Last Updated : May 18, 2019, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details