తెలంగాణ

telangana

ETV Bharat / state

'తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం నేరమే' - వయోవృద్ధుల దినోత్సవాన్ని

వయసు మీద పడిన తల్లిదండ్రులను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు.

'తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం నేరమే'

By

Published : Oct 1, 2019, 7:43 PM IST

వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్బీవీఆర్​ఆర్ సొసైటీ సంయుక్తంగా నిజామాబాద్ ముబారక్ నగర్​లోని ఆలంబన ఆశ్రమంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రామ్మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను ధారపోస్తారని తెలిపారు. కానీ కొందరు పిల్లలు మాత్రం అవన్నీ మర్చిపోయి తల్లిదండ్రులకు వృద్ధాప్యం రాగానే అశ్రద్ధ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడాన్ని ఒక నేరంగా పరిగణించవలసి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శనం, సొసైటీ ఛైర్మన్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

'తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం నేరమే'

ABOUT THE AUTHOR

...view details