తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు రైతు పోరుబాట - FORMERS

పసుపు పంటకు మద్దతు ధర కోసం ఇవాళ నిజామాబాద్ రైతులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు.

పసుపు రైతు పోరుబాట

By

Published : Feb 25, 2019, 4:46 AM IST

Updated : Feb 25, 2019, 9:23 AM IST

పసుపు రైతు పోరుబాట
నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పసుపు పంటకు మద్దతు ధర కల్పన, ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్లతో రైతులు మహాధర్నాకు సిద్ధమయ్యారు.

అనుమతి లేదు..

పసుపు రైతుల మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు నేతలు స్పష్టం చేశారు.

పెద్ద ఎత్తున తరలి వస్తున్న రైతులు..

ర్యాలీలు, రాస్తారోకోలపై పోలీసులు నిషేధాజ్ఞలు విధించినా ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ గ్రామీణం నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:నిన్న 300... నేడు 200

Last Updated : Feb 25, 2019, 9:23 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details