నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్స్ లిక్విడేషన్ను నిరసిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చిన లిక్విడేషన్ ఆర్డర్‌ను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ గోపిరామ్కి వినతిపత్రం అందజేశారు. తెరాస ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు. లిక్విడేషన్ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నిజాం షుగర్స్ లిక్విడేషన్ను రద్దు చేయాలి - NCLT
నేషనల్ లా ట్రిబ్యునల్ నిజాం షుగర్స్‌ను లిక్విడేషన్ చేయాలని ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లిక్విడేషన్ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే పరిశ్రమను తెరిపించాలని కోరారు.

నిజాం షుగర్స్ లిక్విడేషన్ను రద్దు చేయాలి