నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో ఒక్క కార్మికుడు కూడా విధుల్లోకి చేరలేదు. జేఏసీ నాయకుల పిలుపు మేరకు తామంతా ఒకే మాటపై ఉంటామని కార్మికులు పిలుపునిచ్చారు.
'ఆర్టీసీ కార్మికులంతా కలిసే పోరాటం చేస్తాం' - Not a single RTC worker joined the Bodhan Depot
ఆర్టీసీ కార్మికులు 5వ తేదీలోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ గడువు విధించారు. బెదిరింపులకు లొంగేది లేదని, సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లోకి చేరిది లేదంటూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్క కార్మికుడు కూడా విధుల్లోకి చేరలేదు.
బోధన్ డిపో పరధిలో ఒక్క ఆర్టీసీ కార్మికుడు చేరలేదు
సీఎం కేసీఆర్ నిర్ణయించిన డెడ్లైన్ ముగిసేంత వరకు కార్మికులు బస్ డిపో పరిధిలో ఉండి, ఎవరైనా విధుల్లోకి చేరడానికి వేస్తారేమో అని చూశారు. తామందరం సమస్యలు పరిష్కరించే వరకు ఐక్యంగా సమ్మెలో పాల్గొంటామని కార్మికులు తెలిపారు.
ఇదీ చూడండి : ఇంజిన్లో మంటలు ఎగిసిపడి బస్సు దగ్ధం
TAGGED:
విధుల్లో చేరని కార్మికులు