తెలంగాణ

telangana

ETV Bharat / state

'మానసిక వికలాంగుడిపై దాడి అమానుషం' - మానసిక వికలాంగుడిపై దాడి అమానుషం

మానసిక వికలాంగుడు అశోక్​పై దాడి అమానుషమని దివ్వాంగుల సంఘం సభ్యులు అన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిజామాబాద్ జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు రూద్రూర్​లో ధర్నా చేశారు.

'మానసిక వికలాంగుడిపై దాడి అమానుషం'

By

Published : Oct 11, 2019, 6:27 PM IST

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో వంజరి అశోక్ అనే మానసిక వికలాంగుడిపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తమకు నాయ్యం జరిగే వరకు కదలమని... దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రుద్రూర్ గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి మానసిక వికలాంగుడైన వంజరి అశోక్​పై గడ్డపారతో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. విషయం గమనించిన స్థానికులు బాధితుడు అశోక్​ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ చికిత్స పొందుతున్నాడు. 24 గంటలలోపు నిందితుడు కిరణ్​ను అరెస్టు చేయాలంటూ నిజామాబాద్ జిల్లా దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాతా సూర్యవంశీ డిమాండ్ చేశారు. దివ్యాంగుల ధర్నాతో దాదాపు గంట పాటు ట్రాఫిక్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడం వల్ల నిరసనకారులు శాంతించారు.

'మానసిక వికలాంగుడిపై దాడి అమానుషం'

ABOUT THE AUTHOR

...view details