నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్-2 కాలనీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పాల్గొని మొక్కలు నాటారు. హరితహారాన్ని ఉద్యమంగా చేపట్టాలని జడ్పీ ఛైర్మన్ సూచించారు. మొక్కలే మానవాళికి జీవనాధారమని, వాటిని నాటి సంరక్షించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణ.. ప్రతిఒక్కరి బాధ్యత: జడ్పీ చైర్మన్ - indian medical association
నేటి మొక్కలే రేపటి వృక్షాలై పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్-2 కాలనీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.
మొక్కలే మానవాళికి జీవనాధారం: నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్
పట్టణంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటాలన్నారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలై పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని వివరించారు. హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీవన్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రైతుపై బ్యాంక్ సిబ్బంది దాడి.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు