నిజామాబాద్ శివారు స్నేహ సొసైటీలోని దివ్యాంగులకు యూ వీ కెన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా జడ్పీ ఛైర్మన్ దదన్నగారి విఠల్ రావు టీ షర్ట్లు, సబ్బులు, మాస్కులు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు ఎంతో మంది పేద, దివ్యాంగులు, అనాథలకు సాయం చేస్తున్నాయని గుర్తు చేశారు.
దివ్యాంగులకు టీ షర్ట్లు, సబ్బులు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్ - నిజామాబాద్ జిల్లా వార్తలు
స్వచ్ఛంద సంస్థలు ఎంతో మంది పేద, దివ్యాంగులు, అనాథలకు సాయం చేస్తున్నాయని నిజామాబాద్ జిల్లా జడ్పీ ఛైర్మన్ దదన్నగారి విఠల్ రావు అన్నారు. నిజామాబాద్ శివారు స్నేహ సొసైటీలో దివ్యాంగులకు యూ వీ కెన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టీ షర్ట్లు, సబ్బులు, మాస్కులు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు టీ షర్ట్లు, సబ్బులు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్మన్
యూ వీ కెన్ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకున్నారు. ప్రభుత్వం తరఫున కూడా పేదలను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, యూ వీ కెన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సృజన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చావులోనూ విడదీయని స్నేహం.. ఒకేరోజు ఇద్దరు మిత్రుల దుర్మరణం