స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని 30% పెంచడం పట్ల నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విట్టల్ రావు హర్షం వ్యక్తం చేశారు. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
నిజామాబాద్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం - కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించారని నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విట్టల్ రావు కొనియాడారు. గౌరవ వేతనం పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు.
Representatives of local bodies
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల సేవలను గుర్తించారని విట్టల్ రావు కొనియాడారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ.. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:CP Anjani kumar: జోకర్ మాల్‌వేర్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు