Nizamabad Young Man Climbed Kilimanjaro : పర్వతారోహణ అంటే మాటలు కాదు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సన్నద్ధం కావాలి. వాటన్నీంటిని విజయవంతంగా ఎదుర్కొని.. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగాడు ఈ యువకుడు. ఇటీవల కిలిమంజారో(Mount Kilimanjaro)ని అధిరోహించాడు. అక్కడ త్రివర్ణపతాక రెపరెపలాడించి.. తన చిన్ననాటి కలతో పాటు దేశభక్తిని చాటుకున్నాడు నిజామాబాద్(Nizamabad)కు చెందిన మారుతి
నిజామాబాద్ జిల్లా మారుమూల గ్రామమైన నాళేశ్వర్‌కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు మారుతి. చిన్నప్పటి నుంచి పర్వతాలు పర్వతారోహణ చేయాలని కలలు కనేవాడు. చదువులోనూ రాణించేవాడు. ఈ క్రమంలోనే బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ యువకుడు.
Rashtriya Bal Puraskar virat chandra : భళా విరాట్.. ఏడేళ్లకే కిలిమంజారో అధిరోహించిన చిన్నారి
పర్వతారోహణ చేయాలన్న తన కలకు అనుగుణంగా.. అందుకు సంబంధించిన అంశాలపై అవగాన పెంచుకున్నాడు మారుతీ. ఇంటర్ నుంచే వీటి కోసం కొన్ని ఆర్టికల్స్ చదివాడు. ఈ క్రమంలో పశ్చిమబంగలోని డార్జిలింగ్‌లో అవకాశం వచ్చినా ఆర్థిక సమస్యలతో వెల్లలేకపోయానని.. అయినా తన సాధనను ఆపలేదని అంటున్నాడు. పర్వతారోహణ ఖర్చుతో కూడుకున్నది. అయితే ఆ ఆర్థికభారం తల్లిదండ్రులపై పడకూడదు అని చాలా ప్రయత్నాలు చేశాడు మారుతి. అలా మనోడి ఆసక్తి గమనించి గ్రామస్థులు, మిత్రులు కొంతమేర ఆర్థిక సాయం చేశారు. మరో రూ.3 లక్షల వరకు అప్పుచేసి తన లక్ష్యాన్ని చేరుకున్నానని చెబుతున్నాడు.