తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలు కోలుకోవాలని తెరాస నాయకుల పాదయాత్ర - ఎమ్మెల్యేలు కోలుకోవాలని పాదయాత్ర

నిజామాబాద్​ నుంచి మోపాల్​ మండలం ఇందూరు తిరుమల క్షేత్రం వరకు తెరాస నాయకులు పాదయాత్ర నిర్వహించారు. కరోనా బారిన పడిన నిజామాబాద్ అర్బన్, రూరల్​ ఎమ్మెల్యేలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

nizamabad trs leaders padayathra and speial prayers at induru thirumala temle
ఎమ్మెల్యేలు కోలుకోవాలని తెరాస నాయకుల పాదయాత్ర

By

Published : Jun 18, 2020, 7:45 PM IST

నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బీగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని... తెరాస నాయకులు పాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్​లోని సంకట విమోచన హనుమాన్ మందిరం నుంచి మోపాల్ మండలం నర్సింగ్​పల్లి ఇందూరు తిరుమల క్షేత్రం వరకు పాదయాత్ర చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజాసేవలో నిరంతరం కష్టపడుతూ... కరోనా కట్టడికి కృషి చేసిన ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడటం దురదృష్టకరమని నాయకులు అన్నారు. లాక్​డౌన్​ సమయంలో నిరుపేదలకు, వలస కార్మికులకు నిత్యం అన్నదానం చేసినట్టు తెలిపారు. నగరాభివృద్ధికి నిరంతరం సేవలందించారని కొనియాడారు. త్వరగా కోలుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఉగ్ర ఏరివేత.. వేర్వేరు చోట్ల ఎన్​కౌంటర్లు​

ABOUT THE AUTHOR

...view details