తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం - నిజామాబాద్ లో తెరాస నాయకుల సంబరాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి.. నిజామాబాద్ జిల్లా తెరాస నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు తెలుపుతూ టపాకాయలు కాల్చారు.

కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం
కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం

By

Published : Sep 9, 2020, 5:21 PM IST

రెవెన్యూ నూతన చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నిజామాబాద్ జిల్లా తెరాస నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు సంబరాలు చేపట్టారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు తెలుపుతూ టపాకాయలు కాలుస్తూ, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, పార్టీ జిల్లా ఇంఛార్జి తుల ఉమ, జడ్పీఛైర్మన్ దదన్నగారి విఠల్ రావు, నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి , ఆర్ఈడీసీఓ ఛైర్మన్ అలీం, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details