తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2020, 10:07 AM IST

ETV Bharat / state

దండం పెడతాం... బయట తిరగొద్దంటూ పోలీసుల విజ్ఞప్తి

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు నిజామాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు చోట్ల వాహనదారులకు దండం పెడుతూ... బయట తిరగొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

దండం పెడతాం... బయట తిరగొద్దంటూ పోలీసుల విజ్ఞప్తి
దండం పెడతాం... బయట తిరగొద్దంటూ పోలీసుల విజ్ఞప్తి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్ అధికారులు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక పులాంగ్ చౌరస్తా వద్ద... ‘అమ్మా, చెల్లీ, అన్నా’ అంటూ నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారికి దండం పెడుతూ బయటకు తిరగొద్దని కోరారు. నగరంతో పాటు దేశం సురక్షితంగా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. ప్రయాణాలు చేయొద్దని, ఇళ్లకే పరిమితం కావాలని వాహనదారులకు దండం పెడుతూ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details