ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా శాసనసభ్యులు అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ తెదేపా నిజామాబాద్ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాద గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జూన్ 16న జరిగే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్నాయుడిని తప్పించే ప్రయత్నంగా ముందుగా అక్రమ అరెస్టు చేయించడం దారుణమన్నారు.
'అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం జగన్ పిరికిపంద చర్య' - నిజామాబాద్ తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాద గౌడ్
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ తెదేపా విభాగం అధ్యక్షుడు యాద గౌడ్ అన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఏపీ సీఎం పిరికిపంద చర్యని ఆయన ఆరోపించారు.

'అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం జగన్ పిరికిపంద చర్య'
జగన్ అక్రమాలను బయటపెడతారని, ఈఎస్ఐ కుంభకోణంలో ఎటువంటి సంబంధం లేకుండానే ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏపీ సీఎం జగన్ పిరికిపంద చర్యని ఆయన ఆరోపించారు. బీసీలను అణగదొక్కే ఉద్దేశంతో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి రేంజర్ల సురేష్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆంధ్ర ప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్