Nizamabad students win gold medals: తమిళనాడులోని దిండిగల్‌లో జరిగిన సి.బి.యస్.ఇ సౌత్ జోన్ అండర్-14 రైఫిల్ షూటింగ్ టోర్నమెంట్లో నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులకు బంగారు పతకాలు లభించాయి. నగరంలోని ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో చదువుతున్న షేక్ ముస్తకిన్ జాఫీర్, ముస్తఫాసాధ్,షేక్ హాసనొద్దిన్లు 3 బంగారు పతకాలు సొంతం చేసుకొన్నారు.
నిజామాబాద్ విద్యార్థులకు అండర్-14 రైఫిల్ షూటింగ్లో బంగారు పతకాలు - నిజామాబాద్ తాజా వార్తలు
Nizamabad students win gold medals: తాము చదువులోనే కాదు ఆటల్లోను మేటి అని నిరుపించారు నిజామాబాద్‌కు చెందిన విద్యార్థులు. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో చదివే ముగ్గురు విద్యార్థులు తమిళనాడులో జరిగిన రైఫిల్ షూటింగ్ టోర్నమెంట్లో మూడు బంగారు పతకాలు సాధించారు.

Etv Bharat
ఝార్ఖండ్ రాంచీలో జనవరిలో జరిగే అల్ ఇండియా నేషనల్ అండర్ 14 రైఫిల్ షూటింగ్‌కి ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ నుంచి మరో ఇద్దరు విద్యార్థులు తహోద్దిన్, ఆఫ్నానొద్దిన్లు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసింది.
ఇవీ చదవండి: