నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ చక్కెర కార్మాగారాన్ని తామే తిరిగి ప్రారంభిస్తామని ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహించలేని పక్షంలో రైతులకే ఫ్యాక్టరీని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. చక్కెర కర్మాగారం ప్రారంభానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా కమిటీ సభ్యులు గణపతి హోమం, చండీయాగం నిర్వహించారు.
షుగర్ ఫ్యాక్టరీని మాకు అప్పగించండి: కొండ సాయిరెడ్డి - నిజామాబాద్ వార్తలు
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడపాలని ఫ్యాక్టరీ పరిరక్షణ ఛైర్మన్ కొండ సాయి రెడ్డి కోరారు. లేని పక్షంలో రైతులకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఎలాంటి అటంకాలు జరగకుండా కమిటీ సభ్యులు గణపతి హోమం, చండీయాగం నిర్వహించారు.
1995 యాక్ట్ ప్రకారం రైతులకు అప్పగించేందుకు కమిటీ వేయాలని సాయిరెడ్డి కోరారు. ఇందూరు రైతుల ఉత్పత్తిదారుల సంస్థకు 30 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర, నాబార్డు సహకారంతో సుమారు 100 కోట్ల రూపాయలతో నూతన ప్లాంటును నెలకొల్పి నడుపుతామన్నారు. అనుబంధ పరిశ్రమలతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచి ఆత్మ నిర్భర్ భారత్ దిశగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం మార్చి 15 లోపు రైతులకు ఫ్యాక్టరీ లీజుకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని కొండ సాయి రెడ్డి పేర్కొన్నారు.